ఇషా అంబానీ పెళ్లి వేడుక‌ల్లో బాలీవుడ్ హంగామా..

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 02:47 PM
 

బిజినెస్ టైకూన్ ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాల్‌ వ్యాపారదిగ్గజ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో కొన‌సాగ‌తున్నాయి.. ఈ ఇద్ద‌రి వివాహం ఈ నెల  12న జ‌ర‌గ‌నుంది.  ఇషా అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా బాలీవుడ్‌ మొత్తం ఉదయ్‌పూర్‌కు తరలిపోయింది. బాలీవుడ్‌ స్టార్లు ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు.  పెళ్లి వేడుక‌లో భాగంగా జ‌రిగిన సంగీత్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ తారలు చిందులేశారు. కత్రినా, ప్రియాంక వేసిన స్టెప్పులు అదుర్స్‌ అనిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా షారుక్‌ తన భార్య గౌరీ ఖాన్‌తో చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఇక ఈ కార్యక్రమానికి కరణ్‌ జోహర్ హోస్ట్‌ చేస్తూ.. తన టైమింగ్‌తో అందరికి వినోదాన్ని పంచారు‌.  ముకేష్‌ అంబానీతో చేసిన ర్యాపిడ్‌ ఫైర్‌ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. అమిర్‌ దంపతుల డ్యాన్స్‌, సల్మాన్‌ ఖాన్‌-కత్రినాల ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌ నుంచి ప్రభాస్‌ హాజరయ్యాడు.
Recent Post