క్రిస్‌మస్ సంబరాల్లో సమంత

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 03:36 PM
 

ఏమాయ చేశావే సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా చురుకుగా వుంటుంది. ప్రస్తుతం సమంత క్రిస్‌మస్ సంబరాల్లో మునిగితేలుతుంది.




Recent Post