ఒక రిక్షాలో సాయి పల్లవిని కూర్చోబెట్టుకుని

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 05:04 PM
 

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడిపడి లేచే మనసు' ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పోస్టర్లు.. టీజర్.. సాంగ్స్ అన్నిటిలో శర్వా - సాయి పల్లవి కెమిస్ట్రీ హైలైట్ అవుతోంది. ఇద్దరూ టాలెంటెడ్ ఆర్టిస్టులు కావడంతో నిజంగా లవ్ లో ఉన్నారననేంతగా నటనలో జీవిస్తున్నారు.


 తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది.   ఈ సినిమాలో మెజారిటీ భాగం కోల్ కతా నగరంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అక్కడ మనుషులు లాగే రిక్షాలు ఉంటాయి..వాటిని టానా రిక్షాలు అని పిలుస్తారు. అలాంటి ఒక రిక్షాలో సాయి పల్లవిని కూర్చోబెట్టుకుని.. శర్వా ఎంతో ప్రేమతో ఆ రిక్షాను లాగుతున్నాడు. సాయి పల్లవి ఫుల్ గా నవ్వుతుంటే.. శర్వా చిరునవ్వు చిందిస్తూ రిక్షాను లాగుతున్నాడు. ప్రేమలో ఉన్నప్పుడు భారం నిజంగా భారంలాగా అనిపించదు కదా!


సునీల్.. మురళీ శర్మలు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.. ఈరోజే ఆన్లైన్ లో మొత్తం ఆడియో ను విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 14 న రిలీజ్ చేస్తారట.  డిసెంబర్ 21 న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Recent Post