తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది నటి అమలాపాల్. ఈ ఫోటోలో ఓషన్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని యాక్సెసరీస్ ఏవీ లేకుండా సింపుల్ గా పోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో ఫుల్ గ్రీనరీ ఉండడంతో ఫోటోకే కొత్త అందం వచ్చింది. సాధారణంగా అమలా ఫోటోలు ఘాటుగా ఉంటాయి. కానీ ఇది మాత్రం కొంచెం ఘాటుగా కొంచెం క్యూటుగా ఉంది. ఫోటోలో అమల ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సిబుల్ గా ఉంది. ఈ ఫోటోకు అమల ఇచ్చిన క్యాప్షన్ “మీరు ఒక్కోసారి జస్ట్ అలా కూర్చోండి. మీ భుజాలను మీరు ఒకసారి తట్టుకోండి(మిమ్మల్ని మీరే మెచ్చుకోండి). జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అలా ఆస్వాదించండి.. మనస్ఫూర్తిగా.. సంతోషంగా! #ఫ్రీ స్పిరిట్”. అని పేర్కొంది.