బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ లేటెస్ట్ మూవీ `జీరో`. ఈ చిత్రం కత్రిన కెరీర్ లో మరో స్పెషల్ మూవీ అన్న ప్రచారం సాగుతోంది. షారూక్ ఈ చిత్రంలో హీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. ప్రయోగాత్మక కథతో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్కశర్మ నటిస్తోంది. కత్రిన రియల్ లైఫ్ పాత్రలోనే అంటే సినిమా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా లోని `హుస్న్ పరిచమ్…` అనే పాటలో కత్రినా కైప్ అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారును మెస్మరైజ్ చేయబోతోందట. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అంచనాల్ని పెంచేసింది. బావ్ సింగ్ అనే మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తున్నాడు. అనుష్క శర్మ సైంటిస్ట్ గా నటిస్తుండగా కత్రినా కైఫ్ మందుకు బానిసైన సినీ కథానాయిక బబితా కుమారిగా కనిపించనుంది. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం కత్రినాపై ఓ హాట్ రొమాంటిక్ పెప్పీ డ్యాన్స్ నంబర్‌ను ప్లాన్ చేశారు. ఈ పాటలో కత్రినా మరింత హాట్ గా కనిపించి అలరించే బోతోంది. ఈ పాటకు సంబంధించి తాజాగా ఓ ఛమక్కు లాంటి వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా కత్రినా అభిమానులతో పంచుకుంది.