బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ `జీరో` చిత్రంలో నటి కత్రినకైఫ్ పాత్ర చాలా ముఖ్యమైందట. తన వెంటపడే అమాయక మరుగుజ్జు షారూక్ కు జోల్ట్ ఇచ్చే రీల్ లైఫ్ కథానాయికగా తన రియాలిటీ పాత్రలోనే నటిస్తోంది. ఇటీవలే రిలీజైన టీజర్- పోస్టర్లు- సాంగ్ బిట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా `హుస్న్ పరచమ్..` అంటూ సాగే పాటలో నాగినిలా చెలరేగిపోయింది కత్రిన. ఆ పాటలో కత్రిన లుక్ ఇది. ఇదిగో ఇలా బాత్ టబ్ లో కిల్లింగ్ లుక్ తో కట్టి పడేస్తోంది. ఆ చురచుర చూపులకు కొవ్వొత్తులా కుర్రకారు కరిగిపోవడం ఖాయం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.