విక్టీరీ వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల మూవీలలో జత కట్టిన శ్రియా శరణ్ మరోసారి అతడితో నటించనుంది..సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు పాపులర్ రైటర్ కోన వెంకట్ సంస్థ కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మామ అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్యలు హీరోలుగా నటిస్తున్నారు.. .జై లవకుశ మూవీతో బ్లాక్ బస్టర్ అందించిన బాబీ ఈ మూవీ దర్శకుడు..ఇక ఈ మూవీలో వెంకీ సరసన శ్రియా నటిస్తుండగా, నాగ చైతన్య జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.. ఈ మూవీకి వెంకీ మామ టైటిల్ ఫిక్స్ చేయవచ్చు.