ప్రముఖ కమెడియన్, టీవీ నటుడు కపిల్ శర్మ ఒకింటివాడయ్యాడు. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఆయన తాను, తన భార్య గిన్నీ చత్రథ్లు కలిసివున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన అభమానులంతా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కపిల్ శర్మ, గిన్నీలు చాలాకాలంగా డేటింగ్లో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే వారు పంజాబ్లోని అమృత్సర్లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువర్గమంతా హాజరైంది.