ఎన్టీఆర్ టెంపర్ మూవీ హిందీలో సింబా పేరుతో రీమేక్ చేస్తున్నారు.. ఈ మూవీ ఈ నెల 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.రణ్ వీర్ సింగ్, సారా అలీఖాన్ లు జంటగా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లు ప్రతినాయకులుగా కనిపించనున్నారు.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు.. ఇక ఈ మూవీలోని తేరే బిన్ సాంగ్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ సాంగ్ ను రణ్ వీర్, సారా ల మధ్య చిత్రీకరించారు.. రష్మి విరాగ్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను రహెత్ ఫతే అలి ఖాన్, అసీస్ కౌర్, తానిష్క బగ్చీలు ఆలపించారు.. తనిష్క బగ్చీ సంగీతం సమకూర్చాడు..