ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైరా అందాల విందు సాంగ్ రిలీజ్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 12:23 PM



మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 11 వ తేదిన రిలీజ్ కానుంది..ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 4 వ తేదిన నిర్వహించనున్నారు.. హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో జరిగే వేడుకకు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం..కాగా ఈ మూవీలోని తస్సాదీయా సాంగ్ ను ఈరోజు  విడుదల చేయనున్నారు.. ఈ సాంగ్ ను రామ్ చరణ్, కైరాల మధ్య చిత్రీకరించారు.. కైరా ఈ పాటలో అందాలను ఆరబోసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com