తెలుగులో ప్రభాస్, త్రిష, గోపీచంద్ లు నటించిన హిట్ మూవీ వర్షం.. ఈ మూవీని హిందీలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీలతో భాఘీ పేరుతో రూపొందించారు. ఈ మూవీ హిట్ సాధించడంతో ఆ వెంటనే ఆ జంటతోనే భాఘీ 2 కూడా తీసి విడుదల చేశారు. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. అయినన్పటికీ ఈ చిత్ర నిర్మాతలు బాఘీ 3 చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు..అయితే ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగానే తీసుకుంటున్నారు.. హీరోయిన్ విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నారు.. భాఘీ రెండింటిలోనూ హీరోయిన్ గా కనిపించిన దిశాపటానీ స్థానంలో యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ను తీసుకోవాలని భావిస్తున్నారు.. సారా తొలి చిత్రం కేదార్ నాధ్ తో అందర్ని ఆకట్టుకుంది.. ఇక రెండో చిత్రం తెలుగు టెంపర్ రీమేక్ సింబాలో రణ్ వీర్ సింగ్ తో జతకట్టింది.. ఈ మూవీ ఈ నెల 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇప్పుడు భాఘీ 3 లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ టాక్..