ట్రెండింగ్
Epaper    English    தமிழ்

#RRR’ లో రామ్ చరణ్ కోసం జక్కన్న..

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 05:48 PM



రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘#RRR’.ఈ సినిమాలో కథానాయకులుగా ఎన్టీఆర్ ,రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.


ఈ మధ్య జక్కన్న స్క్రిప్ట్ రెడీ కాకుండానే షూటింగ్ మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి.నిజానికి రాజమౌళి పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగుతారని అందరికి తెలిసిన విషయమే.ఈ గ్యాప్ అటు కొడుకు పెళ్లి కోసం,ఇటు రామ్ చరణ్ న్యూ లుక్ కోసమని సమాచారం.


మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్ నటించిన సన్నివేశాలు చాలా తక్కువట.ఎక్కువ భాగం షూటింగ్ ఎన్టీఆర్ తోనే జరిగిందట.


ఎందుకంటే ‘#RRR’ లో రామ్ చరణ్ కొత్త లుక్ కోసం కసరత్తులు చేయడానికి చరణ్ కి సమయం లేదు.అందుకే రెండవ షెడ్యూల్ కి కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు జక్కన్న.ఈ సమయంలో రామ్ చరణ్ కసరత్తులు చేయనున్నారట.


రాజమౌళి సినిమాలో ఎలాంటి లోపం లేకుండా చాలా జాగ్రత్త పడతారు.కొంచెం ఆలస్యమైనా సినిమా బాగుండేలా చూసుకుంటారు.అలాంటిది ఇద్దరు బడా హీరోలతో సినిమా అంటే ఇద్దరినీ సమానంగా చూపించాలి కదా!.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com