విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమాకి విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం ఈ సినిమాకి అందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.