ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి 'గుడ్ బై' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 10:54 AMబిగ్ బీ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మిక మందాన 'గుడ్ బై' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో బోల్తా కొట్టిన ఈ చిత్రం ఓటీటీలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com