ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 06:00 PM



రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.92 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'ఊర్వశివో రాక్షశివో' కలెక్షన్స్ :::::
నైజాం : 98 L
సీడెడ్ : 38 L
UA : 49 L
ఈస్ట్ : 24 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 25 L
కృష్ణ : 27 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.92 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com