ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింగ్ ఖాన్ 'పఠాన్' మూవీ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 09:14 PM



సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే సినిమాలోని రెండు పాటలను లాంచ్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాలోని రెండు పాటలను మూవీ టీమ్ విడుదల చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 25, 2023న విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com