ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌మ‌న్నా 'ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి' షూటింగ్ పూర్తి..

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 07:11 PM



త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి' షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి' సినిమా తెర‌కెక్కుతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే చిత్రయూనిట్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. మైఖెల్ ట్యాబ్యురియ‌స్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. టైజాన్ ఖొరాకివాలా 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి' సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. మెడైంటే ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై మ‌ను కుమ‌ర‌న్ ప్రొడ‌క్ష‌న్ లో ఈ చిత్రం వ‌స్తుంది. త‌మ‌న్నాను ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మ‌సంద్, అనుప‌మ్ చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్ర‌మోష‌న్ ను ఘ‌నంగా మొద‌లు పెట్టారు. న‌టి ప‌రుల్ యాదవ్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా ఉన్నారు. న‌టీన‌టులు: త‌మ‌న్నా భాటియా, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ , సాంకేతిక నిపుణులు:స‌మ‌ర్ప‌కులు: టైజాన్ ఖొరాకివాలా,నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్,బ్యాన‌ర్: మెడైంటే,స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లైగ‌ర్, త్యాగ‌రాజ‌న్,అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్:  జి మోహ‌న్ చంద్ర‌న్, హేట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధ‌బువాలా,సంగీతం: అమిత్ త్రివేది,సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బ్యూరియ‌స్ ,ఎడిట‌ర్: గౌత‌మ్ రాజు ,కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్,పిఆరో: వ‌ంశీ శేఖ‌ర్


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com