వెంకటేష్ ఎందుకు ఏడ్చాడు!

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 07:11 PM

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తొలివారంలోనే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ .." పదేళ్ల తరువాత నా సినిమాను థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూశాను. థియేటర్స్ లో ఆడియన్స్ స్పందన చూశాను. చాలా కాలం తరువాత ఆడియన్స్ నుంచి ఈ స్థాయి రియాక్షన్ చూశాను. ఈ సినిమా చూస్తూ వాళ్లంతా నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు. వాళ్లంతా అలా నవ్వుతుండటం చూసి, ఆనందంలో నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. నా కెరియర్లో చాలా సంక్రాంతి సినిమాలు చూశాను. కానీ 'ఎఫ్ 2' వంటి హిలేరియస్ మూవీ మాత్రం రాలేదు" అని చెప్పుకొచ్చారు.
Recent Post