'96' రీమేక్ కి రంగం సిద్దం..

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 07:29 PM

విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం '96'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాపై తెలుగు స్టార్స్ పలువురు ప్రశంసలైతే కురిపించారు కాని ఆ రీమేక్ లో నటించేందుకు మాత్రం ముందుకు రాలేదు. పలువురు హీరోలకు ఈ చిత్రాన్ని చూపించిన దిల్ రాజుకు నిరాశే మిగిలింది. చివరగా ఈ ప్రయోగాత్మక రీమేక్ లో శర్వానంద్ హీరోగా నటించేందుకు ఒప్పుకున్నాడు.ఇక త్రిష పోషించిన పాత్రను ఎవరైతే బాగా చేస్తారని చర్చించుకుంటున్న సమయంలో దిల్ రాజు ఈ రీమేక్ కోసం సమంతను ఒప్పించాడు. తెలుగులో ఈ చిత్రం రీమేక్ చేయడం మంచి నిర్ణయం కాదన్నట్లుగా సమంత అభిప్రాయ పడింది. కాని దిల్ రాజు ఆమెను కన్విన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.శర్వానంద్, సమంత జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెరకెక్కిస్తున్నాడని, అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుందని రాజు చెప్పుకొచ్చారు. '96 'ఒక డిఫెరెంట్ మూవీ. అలాంటి కథలు తెలుగులో ఆడటం కష్టమే కాని దిల్ రాజు రిస్క్ తీసుకొని మరి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు అనడం లో సందేహం లేదు. మరి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసివ్ చేసుకొంటారో వేచి చూడాలి. ఇదే ఏడాదిలో తెలుగు '96' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


 


 


 
Recent Post