రజనీకాంత్ రిటైర్మెంట్..

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 09:47 PM

రాజ‌మౌళి సినిమా అంటే తెలుగుతో పాటు ఇండియ‌న్ సినిమా అంతా వేచి చూస్తుంది ఇప్పుడు. అలాగే ర‌జినీకాంత్ సినిమా కూడా అంతే. ఇలాంటి ఈ ఇద్ద‌రూ క‌లిస్తే చూడ్డానికి ఒక్క సౌత్ ఆడియన్స్ కాదు.. ఇండియ‌న్ సినిమా ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. తన‌కు ర‌జినీకాంత్‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోన‌ని చెప్పాడు రాజ‌మౌళి. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త‌లు బ‌య‌టికి వ‌స్తున్నాయి. నిజంగానే ఇప్పుడు రాజ‌మౌళితో ర‌జినీకాంత్ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ద‌ర్శ‌క‌ధీరుడు.. ఆ త‌ర్వాత ర‌జినీకాంత్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ కూడా మురుగదాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళితో ర‌జినీకాంత్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.పుల్ ఆర్ పూర్త‌య్యేనాటికి 2020 అవుతుంది.. ఆ లోపు ర‌జినీ కూడా త‌న క‌మిట్మెంట్స్ అన్నీ పూర్తి చేయ‌నున్నాడు. ర‌జినీకాంత్ త‌న చివరి సినిమా రాజ‌మౌళితోనే చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయిప్పుడు. మ‌రి ఇందులో నిజ‌మెంతుందో అనేది రాజ‌మౌళి స్వ‌యంగా చెబితే కానీ క్లారిటీ రాదు. అప్ప‌టి వ‌ర‌కు అభిమానులకు ఈ ఎదురుచూపులు త‌ప్ప‌వు.
Recent Post