నేడు శోభన్ బాబు పురస్కారం అందుకోనున్న సుమ‌న్‌

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 12:51 AM

అలనాటి అందాల నటుడు శోభన్‌ బాబు పురస్కారాన్ని నటుడు సుమన్‌ అందుకోనున్నారు. శోభన్‌బాబు 83వ జయంతి ఉత్సవాలను తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి ఈ నెల 20న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుమన్‌కు రజత కిరిటాన్ని అలంకరించనున్నారు. నటి గీతాంజలికి శోభన్‌ బాబు ఆత్మీయ పురస్కాం అందిస్తారు. నటి జయసుధ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, నటి కవిత తదితరులు పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఎవరీ చక్కనివాడు పేరుతో శోభన్‌బాబు సంగీత విభావరి జరగనుంది.
Recent Post