పూనమ్ పాండే ఆ రాత్రి మొత్తం ఏడ్చిందట

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 12:02 PM

సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పబ్లిసిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ పూనమ్ పాండే. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సంచలన ఫొటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తూ పబ్లిసిటీ దక్కించుకుంటూ వస్తుంది. హాట్ హాట్ కామెంట్స్ తో ఎప్పుడు కూడా పబ్లిక్ లో మీడియాలో ఉండే పూనం పాండే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రియుడితో సెక్స్ చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కొంత సమయం మాత్రమే ఉంది. వెంటనే దాన్ని తొలగించింది. అయితే అప్పటికే ఆ వీడియో రెండు లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.


 


పబ్లిక్ గా ఇలాంటి వీడియోలను షేర్ చేయడం ఏంటీ అంటూ ఆమెను ఫాలో అయ్యే వారు మరియు మీడియా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో పూనం పాండే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. శుక్రవారం రాత్రి నా స్నేహితురాలితో కలిసి డిన్నర్ చేశాను. ఆ సమయంలో నా ఫోన్ ను పక్కకు పెట్టాను. నేను లేని సమయంలో ఆమె నా ఫోన్ లోని ఆ వీడియోను చూసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నన్ను ఆట పట్టించేందుకు ఆమె అలా చేసింది. కాని ఆమె చేసిన పని వల్ల నేను తల ఎత్తుకోలేక పోయాను. ఆ వీడియో పోస్ట్ అయ్యిందని తెలిసి డిలీట్ చేసేప్పటికి చాలా టైం పట్టిందని అప్పటికే చాలా మంది చూశారని పూనం ఆవేదన వ్యక్తం చేసింది.


తన స్నేహితురాలు చేసిన పనికి తాను మీడియా నుండి జనాల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అంటూ ఆ రాత్రంతా కూడా ఏడ్చేశాను. ఒక చోట కూర్చుని చాలా ఏడ్చాను. మీడియాలో వచ్చే విమర్శలను ఎదుర్కోవడం నా వల్ల కావడం లేదంది. అదే సమయంలో ఆ పూర్తి వీడియో తన అఫిషియల్ యాప్ లో ఉందని చెప్పుకొచ్చింది. పొరపాటున పోస్ట్ అయిన ఆ వీడియోను అఫిషియల్ యాప్ లో ఎందుకు పోస్ట్ చేసినట్లు అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. పూనం కావాలనే ఆ వీడియోను పోస్ట్ చేసింది. పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి చీప్ ట్రిక్స్ ను వాడుతుందని అందరు అనుకుంటున్నారు.


 
Recent Post