చిరంజీవి - కొరటాల సినిమాపై క్లారిటీ ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 21, 2019, 07:46 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ సినిమాపై చాలా రోజుల నుండి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.  ఒకసారి ప్రొడ్యూసర్ల మధ్యలోవిభేదాలు ఉన్నాయని అన్నారు. మరోసారి సినిమా లేట్ అవుతుందని అన్నారు. తాజాగా కొరటాల వినిపించిన ఈ సినిమా కథ మెగాస్టార్ కు నచ్చలేదని ఫ్రెష్ గా స్క్రిప్ట్ తయారు చేసి తీసుకురమ్మని కోరాడని కూడా వార్తలు విన్పించాయి. దీంతో మెగాభిమానులలో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే అనుమానం వచ్చింది.

వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా నిర్మాతలైన మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్.. కొణెదల ప్రొడక్షన్స్ కంపెనీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. "చిరంజీవి - కొరటాల శివ ప్రాజెక్టు సంబంధించి మీడియాలో వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజంలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది. ప్రస్తుతం చిరంజీవి 'సైరా' పనుల్లో బిజీగా ఉన్నారు.  ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వస్తుంది" అంటూ రూమర్లన్నిటికీ తెరదించారు.

దీంతో సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు ఏవీ పెట్టునవసరం లేదని ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుందని కన్ఫామ్ అయినట్టే. ఈ క్లారిటీ ఇవ్వడం తప్ప ఈ సినిమాకు సంబంధించిన మరే ఇతర వివరాలు వెల్లడించలేదు. 


 
Recent Post