బ‌న్నీ బుక్ అయిపోయాడుగా!

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 21, 2019, 08:21 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చింది ఎవరు అంటే…ఖచ్చితంగా అది మెగాస్టార్ ఛరిష్మానే అని చెప్పక తప్పదు. అయితే ఆ క్రమంలోనే బన్నీ చిరు ను మామలా కాకూండా గాడ్ ఫాదర్ లా చూస్తాడు. ఆ రోజు పవన్ కి చిరు కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా చిరు వైపే నిలబడ్డాడు బన్నీ, అదీ బన్నీకి చిరుపై ఉన్న భక్తి.


కానీ అలాంటి చిరు సినిమా వల్ల బన్నీ ఇప్పుడే అడ్డంగా బుక్ అయిపోయాడే. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే…మెగాస్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సైరా’ ఈ ఏడాది దసరా బరిలో నిలవనుంది. అదే క్రమంలో బన్నీ-త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా కూడా అదే టైం కి విడుదల కానుంది.అయితే చిరు సినిమా సమయంలో రిలీజ్ అయితే రెండు సినిమాలకు ఇబ్బందులు తలెత్తుతాయి అని ఆలోచనలో ఉన్నారు బన్నీ అండ్ త్రివిక్రమ్, పోనీ మరో పక్క సంక్రాంతి బరిలో నిలుద్దాం అంటే, చిరు సైరా దసరాకి పక్కా కాకపోతే ఇక సంక్రాంతికే వచ్చేది అని చెర్రీ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. మరి ఈ క్రమంలో అటు దసరా..ఇటు సంక్రాంతి ఈ రెండు సీజన్స్ ను మిస్ చేసుకోనున్నాడు బన్నీ. అదీ చిరు సినిమా వల్ల. మరి చిరు సినిమా రిలీజ్ ఆధారంగా బన్నీ తన సినిమాను తెరకెక్కించాలి అని ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. చూద్దాం మరి ఏం చేయనున్నారా బన్నీ అండ్ త్రివిక్రమ్.


 


 


 


 


 


 
Recent Post