చీర కట్టులో అదరగొట్టిన టాక్సీవాలా హీరోయిన్

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 12:15 PM

చీరకట్టు ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.  అందుకే భారతీయ మహిళలు చీరకు ప్రాధాన్యత ఇస్తారు.  చీర ఎలా కట్టుకున్నా అందంగానే కనిపిస్తుంది.  హీరోయిన్లు చీర కట్టుకుంటే.. అబ్బో రెండు కళ్ళు చాలవు.  పాతతరం హీరోయిన్లు ఎక్కువగా చీరలోనే కనిపించారు.  కాలం మారింది ఫ్యాషన్ మారింది.  ఇప్పుడు సినిమా స్టార్స్ నుంచి సామాన్యుల వరకు అందరు ట్రెండీ లుక్ లో కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


కొంతమంది మాత్రం సినిమాల్లో ఎలా ఉన్నాయా.. బయట మాత్రం శారీలో కనిపించి కనువిందు చేస్తున్నారు.  అలా కనువిందు చేసిన హీరోయిన్లలో ఒకరు ప్రియాంక జవాల్కర్.  టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ అమ్మడు రీసెంట్ గా దిగిన శారీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ పోస్ట్ కు "రోడ్డు దాటుతున్న" అంటూ చిన్న క్యాప్షన్ ఇచ్చింది.  క్యాప్షన్ సంగతి సరేగాని, బ్లాక్ శారీలో ఈ అమ్మడిని చూసిన నెటిజన్లు ఫోటోను విపరీతంగా లైక్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.  


 


 
Recent Post