ధనుష్ సరసన 40 ఏళ్ల హీరోయిన్ !

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 12:18 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలో 'అసురన్' అనే సినిమా చేస్తున్నాడు.  ఇందులో అతనికి జోడీగా    ఒకప్పుడు స్టార్ కథానాయకిగా వెలుగొందిన మంజు వారియర్ నటించనుంది.  సాధారణంగా హీరోలు తనకన్నా చిన్న వయసున్న వాళ్ళను లేదా తమతో సమానమైన వాళ్ళను హీరోయిన్లుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారు.  కానీ ధనుష్  మాత్రం ఇలా 40 ఏళ్ల వయసున్న మంజు వారియర్ తో కలిసి నటిస్తుండటం విశేషం.   స్వతహాగా మంచి నటి అయిన మంజు వివాహం తరవాత చాలా ఏళ్ళు నటనకు దూరంగా ఉండి 2014లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.  ఇకపోతే ఈ 'అసురన్' చిత్రాన్ని వెట్రి మారన్ డైరెక్ట్ చేయనున్నాడు. 
Recent Post