ఫిబ్రవరి 1వ తేదీన కానున్న శింబు చిత్రం

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 03:01 PM

తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చేసిన 'అత్తారింటికి దారేది' సంచలన విజయాన్ని నమోదు చేసింది. పవన్ కల్యాణ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అలాంటి ఈ సినిమాను తమిళంలో 'వంత రాజవతాన్ వరువేన్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. సుందర్ .సి దర్శకత్వంలో శింబు కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.


మేఘ ఆకాశ్ .. కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చూశారు గానీ కుదరలేదు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, శింబుకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
Recent Post