హీరో సుధీర్ బాబు నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటోంది హీరోయిన్ నభా నటేష్ గురించే. సినిమా ఆసాంతం తన అల్లరితో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కన్నడ సోయగం. సినిమాలో సగానికి పైగా తన అల్లరికే ఎక్కువ మార్కులు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్ హాఫ్‌లో తన అల్లరికి ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్‌లో అద్భుతమైన ఎమోషన్స్‌ను పండించి తనలో నటనా ప్రతిభ కూడా ఉందని నిరూపించుకుంది. అయితే నభా నటేష్ నటించిన తొలి చిత్రం అదుగో.. ఈ మూవీ కంటే ముందు నన్ను దోచుకుందువటే మూవీ రిలీజ్ కావడంతో అదే తొలి సినిమా అయింది.. ఇక తాజాగా ఈ కన్నడ నటి రవితేజ సరసన నటించనుంది.. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారు.. ఈ మూవీ కోసం తన మేకోవర్ ను మొత్తం మార్చేసుకుంది.. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..