కష్టమంతా తారక్‌కే.. చరణ్ కూల్..!!

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 14, 2019, 08:00 PM

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ మీద పోలీస్ స్టేషన్, యాక్షన్ సన్నివేశాలను రాజమౌళిస్ సెకండ్ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి గ్యాపిచ్చి.... రామ్ చరణ్ ని జక్కన్న కష్టపెడుతున్నాడంటూ ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎన్టీఆర్ కి రెస్ట్ చరణ్ కి వర్క్ అంటూ కామెంట్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో రీసెంట్ గా దుబాయ్ ట్రిప్ కూడా వేసాడు. భార్య లక్ష్మి ప్రణతి కొడుకుతో ఎన్టీఆర్ దుబాయ్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడన్నారు. అయితే ఎన్టీఆర్ అక్కడ భార్య పిల్లలతో గడపడంతో పాటుగా..... స్పెషల్ గా జిమ్ ట్రైనింగ్ తీసుకుని మేకోవర్ అవుతున్నాడట.
మరి ఒల్లొంచి జిమ్ లో ఎన్టీఆర్ కష్టపడుతూ న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనర్ లియోడ్ స్టీఫెన్స్ వద్ద ట్రైన్ అవుతున్నాడట. మరి RRR లో ఎన్టీఆర్ కొత్త అంటే డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తాడట. అందుకే ఈ వర్కౌట్స్ గట్రా అంటున్నారు. కానీ రామ్ చరణ్ ఎప్పటిలాగే మాస్ లుక్ లోనే RRR లో కనిపించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. లుక్ కొత్తగా లేకపోయినా చరణ్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి జిమ్ లో కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ కష్టపడుతుంటే... రామ్ చరణ్ మాత్రం ఓల్డ్ మాస్ లుక్ తోనే RRR కానిచ్చేస్తున్నాడు.
అందుకే ఎన్టీఆర్ కష్టపడుతుంటే.... చరణ్ మాత్రం కూల్ అన్నది. ఇక మూడో షెడ్యూల్ సమయానికి ఎన్టీఆర్ న్యూ లుక్ మాత్రమే కాదు... జక్కన్న హీరోయిన్స్ ని మిగతా స్టార్ కాస్ట్ ని కూడా ఫైనల్ చేస్తాడట. మరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించబోతున్నారో అనే ఉత్సుకత రోజు రోజుకి ప్రేక్షకుల్లోనూ మీడియా మిత్రుల్లోనూ పెరిగిపోతుంది. డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
Recent Post