బాగా ఇబ్బందుల్లో ఉండగా నాతో ఒక ఆట ఆడుకున్నాడు: బండి సరోజ్

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 14, 2019, 08:01 PM

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ప్రస్తావించాడు. "తమిళంలో నేను చేసిన 'పోర్ కలమ్' సినిమా చూసిన ఒక తెలుగు యంగ్ హీరో నన్ను కలుసుకున్నాడు. నా అభిమానినని చెప్పి .. నాతో వర్క్ చేయాలని వుందని చెప్పాడు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తరువాత నేను చేసిన ఒక సినిమా ట్రైలర్ చూసి నాకు కాల్ చేశాడు. తనతో ఆ సినిమా చేస్తే బాగుండేదని అన్నాడు. నీకు తగిన కథ దొరికితే నీతో తప్పకుండా చేస్తాను అని చెప్పాను.

కొన్నాళ్ల తరువాత నేను ఆర్థికపరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాను. ఆ సమయంలో తప్పకుండా నేను సినిమా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోగా ఆ హీరోకి ఒక సక్సెస్ పడింది. మంచి కథ రెడీ చేసుకుని .. వింటావా అని అడిగితే, ఫలానా రోజున కాల్ చేస్తే .. ఫలానా ప్లేస్ లో కలుద్దామని అన్నాడు. అలా రేపు .. మాపు అంటూ నన్ను రెండు నెలలకి పైగా విసిగించాడు. బాగా ఇబ్బందుల్లో ఉండగా నాతో ఒక ఆట ఆడుకున్నాడు. దాంతో 'ఏదో ఒక రోజున నా ఆఫీస్ వెతుక్కుంటూ వస్తావు .. గుర్తుపెట్టుకో' అని అన్నానంటూ చెప్పుకొచ్చాడు. 
Recent Post