వరుస ట్వీట్లతో ఉపాసన సెన్సేషన్!

  Written by : Suryaa Desk Updated: Thu, Feb 14, 2019, 09:50 PM

ప్రేమలో పడొద్దు.. ఇది రామ్ చరణ్ మాట, వరుస ట్వీట్లతో ఉపాసన సెన్సేషన్!  రామ్ చరణ్, ఉపాసన ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. చిన్నతనం నుంచి స్నేహితులైన వీరు.. తమ స్నేహ బంధాన్ని ప్రేమ బంధంగా మార్చుకుని ఆపై దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ జంట ప్రేమికుల దినోత్సవాన్ని స్పెషల్‌గా జరుపుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర పోస్టులు చేశారు. ప్రేమ గురించి రామ్ చరణ్ చెప్పిన ఓ మాటను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.  వాలంటైన్స్ డే స్పెషల్ బ్రేక్ ఫాస్ట్‌తో రోజు మొదలు.. వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఆరగించి రోజు మొదలు పెట్టినట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. తాము ఇద్దరం ఎప్పుడూ హెల్దీగా, ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తామంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రేమలో పడొద్దు.. ఇది రామ్ చరణ్ మాట ప్రేమ గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. మిస్టర్ సి(రామ్ చరణ్) మాటల్లో చెప్పాలంటే... ‘ప్రేమలో పడొద్దు.. ప్రేమతో ఎదుగు' అని అంటారని ఉపాసన ట్వీట్ చేశారు. రామ్ చరణ్-ఉపాసన ఈ సందర్భంగా ఉపాసన తమ ఇద్దరి గురించి వచ్చిన ఓ మేగజైన్లో వచ్చిన ఆర్టికల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటూ తన ప్రేమికుడు, జీవిత భాగస్వామి రామ్ చరణ్‍‌తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన షేర్ చేశారు.


 


 
Recent Post