ఎబిసిడి నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:34 AM

అల్లు శిరీష్‌, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటిస్తున్న ‘ఏబీసీడీ’ చిత్రం మార్చి ఒకటవ తేదీన విడుదలకానుంది. సీనియర్‌ నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకులు. అల్లు శిరీష్‌కు తండ్రిగా నాగబాబు నటిస్తున్నారు. హీరో స్నేహితునిగా భరత్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా సంజీవ్‌ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. బిగ్‌ బెన్‌ సినిమాస్‌ యశ్‌. రంగినేనితో కలిసి మధుర శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జుధా సాంధీ సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లన్ లు ఈ పోస్ట‌ర్ లోఅందంగా క‌నిపిస్తున్నారు..ఈ మూవీ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 1న సినిమాను విడుదల కానుంది.
Recent Post