ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'కస్టడీ'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 08:53 PM



తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాప్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో జూన్ 9, 2023 నుండి తమ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కన్నడ మరియు మలయాళ భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ తెలుగు-తమిళ చిత్రానికి  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com