చెన్నైలో జరిగిన శ్రీదేవి సంవత్సరీకం

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 10:34 AM

అతిలోకసుందరిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి మరణించి మరో 10 రోజులకు ఏడాది పూర్తవుతోంది. అయితే తిథి ప్రకారం నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో, చెన్నైలో నిన్న ఆమె సంత్సరీకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషీ, మరిది అనిల్ కపూర్ లు హాజరయ్యారు. చెన్నైలోని శ్రీదేవి ఇంట్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తమిళ నటుడు అజిత్, ఆయన భార్య షాలిని కూడా హాజరయ్యారు.


శ్రీదేవి, అజిత్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా తమిళ వెర్షన్ లో అజిత్ అతిథి పాత్రలో కనిపించారు. అజిత్ తో ఓ సినిమా నిర్మించాలని శ్రీదేవి కూడా భావించారు. అయితే, సరైన కథ దొరకకపోవడంతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
Recent Post