ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కస్టడీ' డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 02:24 PM



తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన 'కస్టడీ' సినిమా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాప్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.01 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ తెలుగు-తమిళ చిత్రానికి  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.


'కస్టడీ' కలెక్షన్స్ :::::::::
1వ రోజు : 1.82 కోట్లు
2వ రోజు : 80 L
3వ రోజు : 78 L
4వ రోజు : 40 L
5వ రోజు : 37 L
6వ రోజు : 30 L
7వ రోజు : 20 L
8వ రోజు : 22 L
9వ రోజు : 20 L
10వ రోజు : 17 L
11వ రోజు : 15 L
12వ రోజు : 12 L
13వ రోజు : 10 L
మిగిలిన రోజులు : 23 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.01 కోట్లు (9.28 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com