రణబీర్ - ఆలియా మధ్యా గొడవ ?

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 10:35 AM

ఇద్దరి మధ్యా అలాంటి కీచులాటలేనా?  లేక ఇంకేదైనా సీరియస్ గ్యాప్ రన్ అవుతోందా?  ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంతగా ఏం గొడవ జరిగిందబ్బా? .. అంటే డీప్ గా వివరాల్లోకి వెళ్లాల్సిందేబాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్ - ఆలియా భట్ మధ్య లవ్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా విడదీయలేనంత ఘాడానుబంధం పెనవేసుకుంది. ఒకరికోసం ఒకరు పరితపించిపోతారు. ఇరువైపులా కుటుంబీకులకు ఆ ఇద్దరి స్నేహం ఇష్టమే. ఆ జంట పెళ్లికి సిద్ధమే. తొందర్లోనే పెళ్లికి బాజా మోగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఒకటే ప్రచారం సాగింది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ కొత్త రూమర్  వేడెక్కిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా గొడవ జరిగింది! అంటూ ముంబై మీడియా ఆసక్తికర కథనాలు వేడెక్కిస్తున్నాయ్. అది కూడా ప్రేమికుల రోజున ఇలాంటి గొడవ గురించి బయటపెట్టి బాలీవుడ్ మీడియా నానా యాగీ చేస్తోంది.   అసలు ఏం జరిగింది? అంటే..


 


ఫిబ్రవరి 14న గల్లీ బోయ్ రిలీజ్ సందర్భంగా ఒకరోజు ముందే సెలబ్రిటీ ప్రివ్యూ షో వేశారు. ఈ ప్రివ్యూకి రణవీర్ - దీపిక - రణబీర్ - ఆలియా జంటలుగా కలిసి వెళ్లారు. అయితే  షో అయ్యాక అసలు కథ మొదలైంది. రణబీర్ - ఆలియా జంట ఎందుకనో కలతగా కనిపించిందిట. ఆ ఇద్దరూ షో ముగిసిన తర్వాత తమ కార్ ఎక్కారు. కానీ ఏదో జరిగింది. ఆ ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దాంతో ఆ ముఖాల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. అసలింతకీ ఆ ఘర్షణ ఏంటి? అంటూ ఒకటే హడావుడి చేసేసింది మీడియా. `గల్లీ బోయ్` చిత్రంలో రణవీర్ సింగ్ - ఆలియా జంట హాట్ హాట్ గా నటించారు. ఆ ఇద్దరి మధ్యా లిప్ లాక్ సీన్స్ - వేడెక్కించే సన్నివేశాలకు కొదవే లేదు. అయితే ఆలియా ఫ్రీడమ్ విషయంలో రణబీర్ అడ్డు చెప్పాడా?  గొడవ పడ్డాడా? అన్న కోణం ఇందులో ఉందా.. అంటూ సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది అన్న సందేహాన్ని సదరు కథనాలు వేడెక్కించడం విశేషం.


 


 
Recent Post