జెర్సీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 10:47 AM

నేచుర‌ల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'జెర్సీ'. 'మ‌ళ్లీ రావా' ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. లేటు వయసులో క్రికెటర్ గా ఎదగాలనుకునే వ్యక్తిగా నాని ఇందులో కనిపించనున్నాడు. ఆదాశర్మ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలవనుంది. దీంతో ఇప్పటి నుండే ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ఇంతకుముందే జెర్సీ టీజ‌ర్ విడుద‌లవగా.. తాజాగా సినిమాలోని ఓ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు.


'అదేంటో గాని ఉన్న‌పాటుగా.. అమ్మాయి ముక్కుమీద నేరుగా..' అనే పాట యొక్క లిరిక‌ల్ వీడియో విడుద‌ల అయింది. అనిరుద్ ర‌విచంద్ర‌న్ ఈ పాటను ఆలపించగా.. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది వీక్షించారు. ఈ సాంగ్ త‌మిళంలో కూడా విడుద‌ల అయింది. 


 
Recent Post