ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTTలో సెన్సేషన్ సృష్టిస్తున్న '2018'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:43 PM



జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం విడుదలై మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIVసొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జూన్ 7, 2023న మలయాళ వెర్షన్, తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడతో సహా ఇతర భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన తర్వాత, ఈ చిత్రం OTTలో తన జోరు ని ప్రారంభించింది. ప్రస్తుతం 2018 సినిమా సోనీ LIV ఇండియాలో అగ్రస్థానంలో ఉంది.

ఈ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com