మహేష్ హీరోయిన్ కావాలి అంటున్న బన్నీ

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 11:38 AM

త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ పూర్తి చేసేశాడు. ఇక ఇప్పుడు ఆయన నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు. తన జోడీగా కైరా అద్వాని అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని బన్నీ వ్యక్తం చేశాడట. కైరా అద్వాని డేట్స్ సర్దుబాటు కావడం కష్టంగా అనిపిస్తోందనీ, అందువలన పూజా హెగ్డేను తీసుకుందామని త్రివిక్రమ్ అంటున్నాడట. ఆల్రెడీ తనతో ఆమె 'దువ్వాడ జగన్నాథం' చేసింది కనుక, కైరా అయితే కొత్తగా ఉంటుందంటూ తన మనసులోని మాటను బన్నీ చెప్పేశాడు. 'అరవింద సమేత'లో పూజా హెగ్డే నటనకి ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ మాత్రం ఆమె అయితేనే బాగుంటుందని భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.


 
Recent Post