ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZEE5లో 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లాక్ చేసిన కాప్ డ్రామా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:44 PM



సంచలనాత్మక తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి కథానాయకుడిగా నటించిన విడుతలై పార్ట్ 1 సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల పార్ట్ 1గా విడుదలైంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ZEE5లో ప్రీమియర్‌గా అందుబటులో ఉంది. అంతేకాకుండా మూవీ మేకర్స్ OTT వెర్షన్‌లో డైరెక్టర్స్ కట్‌ను అదనంగా చేర్చారు.

తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లోక్ చేసినట్లు OTT ప్లాట్‌ఫారమ్ అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్,  ళవరసు, బాలాజీ శక్తివేల్, తమిస్  మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ కాప్ డ్రామాలో భవాని శ్రీ మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత అందించారు. RS ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com