నరకాసురుడుగా వస్తున్న అరవింద్ స్వామి

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 01:55 PM

ఒకప్పుడు సౌత్ లో అమ్మాయిల కలల రాకుమారుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అరవింద్ స్వామి. అరవింద్ స్వామి చాలా గ్యాప్ తర్వాత మరల తని ఒరువన్ అనే సినిమాతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అదే సినిమా తెలుగు రీమేక్ ద్రువ్ లో కూడా అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్ లో మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న అరవింద్ స్వామి టైటిల్ రోల్ లో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో నరకాసురన్ అనే సినిమా తమిళంలో వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అరవింద్ స్వామితో పాటు తెలుగు యువ హీరో సందీప్ కిషన్, అలాగే స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ జరుపుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. 


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసారు. అరవింద్ స్వామిని ఎలివేట్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర దర్శకుడు అందులో సినిమా మూడ్ ని కూడా ఎలివేట్ చేసాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం వుంది. గతంలో 16 అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కార్తిక్ నరేన్ ఈ సినిమాని కూడా తెరకెక్కించడం దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్ లో హీరోగా వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ ప్రేక్షకులని ఎ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
Recent Post