పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నయనతార

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 03:21 PM

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌య‌న్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంద‌నే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు అప్పుడు అని వినిపిస్తున్నా కూడా ఆ ఎప్పుడు ఎప్పుడనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. దానికి తోడు న‌య‌న‌తార ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతుంది. ఇంకా మాట్లాడితే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈమే. న‌య‌న‌తార ఉందంటే సినిమా హిట్.. ఇక్క‌డ మ‌రో అనుమానం అవ‌స‌రం లేదు.అందుకే ప్రేక్ష‌కులు కూడా ఇప్పుడు న‌య‌న్ సినిమా అంటే ఎలా ఉంది అని అడ‌గడం మానేసారు. ఆమె ఓకే చేసిందా అయితే హిట్టేలే అంటున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ న‌య‌న‌తార కూడా వ‌ర‌స హిట్ల‌తో జోరుమీదుంది. దానికితోడు అవార్డుల ప‌రంగానూ న‌య‌న‌తార దూకుడు మామూలుగా లేదు. ఆమె సినిమా చేసిందంటే ఆ ఏడాది అన్ని అవార్డులు ఆమె కోస‌మే ప‌రుగులు తీస్తున్నాయి. గతేడాది రెండు హిట్లు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో కూడా ఈమె 


వ‌ర‌స సినిమాలు చేస్తుంది.


 


తెలుగులో చిరంజీవితో సైరా సినిమాల్లో న‌టిస్తుంది న‌య‌న‌తార‌. ఓ వైపు వ‌ర‌స‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు హీరోలతో కూడా న‌టిస్తూ బిజీగా ఉంది. న‌య‌న్ కోసం ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. అన్ని భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 60 సినిమాల్లో న‌టించింది. ఈమె హీరోయిన్ గా 100 సినిమాలు పూర్తైన త‌ర్వాత కానీ పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తుంది.ఇప్పుడు దాదాపు 10 సినిమాలు న‌య‌న్ కోసం వేచి చూస్తున్నాయి. అంటే మ‌రో 30 బాకీ అన్న‌మాట‌. అమ్మ‌డి వ‌య‌సు ఇప్పుడు 36.. మ‌రో నాలుగేళ్ళైనా ఈ సినిమాల కోసం టైమ్ తీసుకుంటుంది న‌య‌న‌తార‌. అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి అనే మాట లేకుండా హాయిగా ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేయ‌నుంది న‌య‌న్. మొత్తానికి ఈమె పెళ్లి ముచ్చ‌ట కోసం మ‌రి కొన్నేళ్ల పాటు వేచి చూడ‌క త‌ప్ప‌దు.


 
Recent Post