బ‌ర్త్‌డే పార్టీ లో కపూర్ ఫామిలీ సందడి

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 04:47 PM

క‌పూర్ సిస్ట‌ర్స్ క‌రీనా, క‌రీష్మాలు త‌మ తండ్రి ర‌ణధీర్ క‌పూర్ 72వ పుట్టిన రోజుని స్పెష‌ల్‌గా జ‌రిపారు. బ‌ర్త్‌డే పార్టీలో అంద‌రు బ్లాక్ డ్రెస్‌లో మెర‌వ‌గా , ఈ పార్టీకి క‌రీనా తన భ‌ర్త సైఫ్ అలీఖాన్‌తో హాజ‌రు అయింది. ఇక క‌రీష్మా త‌న కూతురు స‌మీరాతో పార్టీలో సంద‌డి చేసింది. ర‌ణ‌ధీర్ మేనల్లుడు ఆర్నాన్‌, ఆదార్ జైన్ కూడా వేడుక‌కి హాజ‌రు అయ్యారు. క‌రీష్మా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ‌ర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫోటోల‌ని పోస్ట్ చేసి త‌న తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. క‌రీనా క‌పూర్ న‌టించిన త‌క్త్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతుండ‌గా ఇందులో ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్‌, భూమి ప‌డ్నేక‌ర్‌, విక్కీ కౌశ‌ల్‌, జాన్వీ క‌పూర్, అనీల్ క‌పూర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. 
Recent Post