డిస్కో రాజా బిజినెస్ మొదలైంది

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:22 PM

రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు రవితేజ. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో మాస్ మహారాజ్ మళ్ళీ ఫ్లాపుల బాట పట్టాడు. దాని నుంచి బయటపడేందుకు దర్శకుడు విఐ ఆనంద్ తో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న డిస్కో రాజా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది.
అసలే ఫ్లాపులతో ఉన్న రవితేజ సినిమాకు బిజినెస్ అంతంత మాత్రమే జరుగుతుందని అనుకున్నారు. కానీ, డిస్కో రాజాకి అప్పుడే బేరం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీ రైట్స్ అమ్ముడుపోయాయి. సురేష్ రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ ఫాన్సీ రేటుకి తీసుకున్నారు. డిస్కో రాజాకి ఈ రేంజ్ లో డిమాండ్ పెరగడం చూసి రవితేజనే షాక్ అయ్యారట. అవునా.. ? అప్పుడే బేరం మొదలైందా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట.


 
Recent Post