నేచుర‌ల్‌స్టార్ కృత‌జ్ఞ‌త ఖ‌రీదు 35 కోట్లు?

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:25 PM

నేచుర‌ల్ స్టార్ నాని కృత‌జ్ఞ‌త ఖ‌రీదు 35 కోట్లు. ఏంటీ ఆశ్చ‌ర్యంగా వుందా?. ర‌మ్మ‌బుద్ది కావ‌డం లేదా?.. ఎవ‌రైనా క‌ష్ట‌కాలంలో వున్న‌ప్పుడు మ‌న‌ల్ని ఆదుకుని ఒడ్డున ప‌డేస్తే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కృత‌జ్ఞ‌త తీర్చుకుంటాం. అందు కోసం మ‌న‌కు స‌హాయం చేసిన వారికి ఏదో రూపంలో స‌హాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం. ప్ర‌స్తుతం నేచుర‌ల్‌స్టార్ నాని అదే చేయ‌బోతున్నాడు. అది ఎవ‌రికో కాదండోయ్ యంగ్ డైరెక్ట‌ర్ మారుతికి. త్వ‌ర‌లో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడు.  ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో `జెర్సీ` చిత్రాన్ని చేస్తున్న నాని త్వ‌ర‌లో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు.
`శైలెజారెడ్డి అల్లుడు` సినిమాతో భారీ డిజాస్ట‌ర్ ఇచ్చిన మారుతికి నాని సినిమా ఇవ్వ‌డం ఏంటి? అని అంతా అనుకుంటున్నారు. ఇక్క‌డే పెద్ద ట్విస్ట్ వుంది. `జెండా పై క‌పిరాజు`, ఆహా క‌ల్యాణం వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో వున్న నానికి   `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`. సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని అందించి అత‌ని కెరీర్‌ని మ‌ళ్లీ గాడిలో పెట్టాడు మారుతి. ఆ విష‌యం అంతా మ‌ర్చిపోయినా నాని మాత్రం మ‌ర్చిపోలేద‌ట‌. ఆ కార‌ణంగానే ప్ర‌స్తుతం ఫ్లాపుల్లో వున్న మారుతికి అవ‌కాశం ఇస్తున్నాడ‌ని, పైగా ఈ చిత్రానికి తానే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని తెలిసింది. సినిమాకు దాదాపు 35 కోట్ల బడ్జెట్‌ పెట్టేందుకు నాని సిద్ధ‌మ‌వుతున్నాడు.
మిగ‌తా హీరోలు మారుతికి అవ‌కాశం ఇవ్వ‌డానికి జంకుతుంటే నాని ఏకంగా హీరోగా న‌టిస్తూనే తానే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ 35 కోట్ల‌తో రిస్క్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. క‌ష్ట‌కాలంలో మారుతి త‌న‌కు హిట్ ఇచ్చాడ‌న్న కృత‌జ్ఞ‌త కోసం భారీ బ‌డ్జెట్‌తో రిస్క్ చేయ‌డం అవ‌స‌ర‌మా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నార‌ట‌. 
Recent Post