సౌత్ పై సల్మాన్ కన్ను

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:53 PM

సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న భారత్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  కత్రినా కైఫ్ హీరోయిన్.  కొరియన్ సినిమా స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  రీసెంట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకోవడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.  ఈ సంవత్సరం ఈద్ కు సినిమా రిలీజ్ అవుతున్నది.  గతేడాది సల్మాన్ ఖాన్ రేస్ 3 ప్లాప్ కావడంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సల్మాన్. హిందీలోనే కాకుండా ఈ సినిమా సౌత్ లో మేజర్ లాంగ్వేజ్ లలో కూడా రిలీజ్ కాబోతున్నది.  తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.  
Recent Post