రజనీతో రెండోసారి నయన్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 11:14 AM

'సర్కార్' సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన సంతోషంలో మురుగదాస్ వున్నాడు. ఇక 'పేట' సినిమా సక్సెస్ తో రజనీకాంత్ మాంఛి జోష్ తో వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. నయనతారతో మురుగదాస్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. అయితే కీర్తి సురేశ్ కి బదులుగా నయనతారను తీసుకుంటున్నారా? లేదంటే కీర్తి సురేశ్ తో పాటు నయనతార కూడా వుంటుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. నయనతార ఎంపిక నిజమే అయితే, కథానాయికగా ఆమె 'చంద్రముఖి' తరువాత రజనీతో చేస్తోన్న సినిమా ఇదే అవుతుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 


 


 
Recent Post