త‌మిళ అర్జున్ రెడ్డి కొత్త హీరోయిన్ గా బ‌నితా సంధూ…

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 02:27 PM

విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళంలో ‘వర్మ’గా తెరకెక్కుతోంది. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్‌ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో సంచలనం సృష్టించిన ఈ సినిమాపై తమిళంలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షాలినీ పాండే పాత్రలో మేఘా చౌదరీ నటిస్తున్నది.. ఈశ్వరీరావు కీలకపాత్రలో కనిపించనుంది..ఈ మూవీకి బాల ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అవుట్ పుట్ చూసిన ధృవ్ తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు.. దీంతో పూర్తి అయిన షూట్ ను మొత్తం డ‌స్ట్ బిన్ లో ప‌డేశారు.. ధృవ్ ను త‌ప్ప ద‌ర్శ‌కుడితో స‌హా న‌టీన‌టులంద‌రిని మార్చి మ‌ర‌లా మూవీని మొద‌టి నుంచి తీయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.. ఇక తాజాగా ఈ మూవీ కోసం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు.. బాలీవుడ్ మూవీ అక్టోబ‌ర్ లో వ‌రుణ్ దావ‌న్ తో న‌టించిన భార‌త సంత‌తి బ్రిటిష్ భామ బ‌నితా సంధూని ఎంపిక చేశారు… మోడ‌ల్ గా కెరీర్ ను ప్రారంభించిన బ‌నితా ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు ద‌క్షిణాదిలో ధృవ్ తో అడుగుపెడుతున్న‌ది.
Recent Post