ప్రెగ్నెంట్ అయిన యాంకర్

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 03:04 PM

తెలుగు టెలివిజన్ రంగంలో యమ క్రేజ్ ఉన్న యాంకర్లలో లాస్య‌ ఒకరు. తనదైన శైలిలో రాణించిన నెంబర్ వన్‌ అనే పేరును సంపాదించుకొన్నది. యాంకర్‌గా టాప్ స్థానంలో కొనసాగుతుండగా పెళ్లి చేసుకొని తన జోరును తగ్గించింది. దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే అడపదడపా బుల్లితెరపైన మ్యాజిక్ చేస్తున్నారు. తాజాగా అభిమానులకు లాస్య శుభవార్తను అందించారు. అదేమిటంటే..లాస్య, మంజునాథ్ దంపతులు శుక్రవారం రెండో వివాహా వార్సికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సంతోష సమయంలో తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఫొటోలతో సహా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 10 సంవత్సరాల పరిచయం, తొమ్మిది ప్రేమ బంధం, 2 సంవత్సరాల పెళ్లి బంధం అంటూ ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేసింది.మా ఇంట్లోకి బుల్లి వారసుడు రాబోతున్నాడని ఫోటో ద్వారా వెల్లడించింది. తాను గర్భం దాల్చిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలకు మంచి స్పందన లభిస్తున్నది.తన గర్భంపై భర్త మంజునాథ్ ముద్దు పెట్టుకొంటున్న ఫొటోను, తల్లి కాబోతున్న అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పలువురు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.తన ప్రియుడు మంజునాథ్‌‌తో చాలా కాలం ప్రేమలో ఉన్న లాస్య అతడిని 2017 ఫిబ్రవరిలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి కెరీర్‌కు కొంచెం దూరంగానే ఉన్నారు. అప్పుడప్పుడు సందర్బోచితంగా బుల్లితెర మీద కనిపిస్తున్నారు.
Recent Post