ఇప్పుడు రకుల్ పాప పరిస్థితేంటి?

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 07:04 PM

ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్ హిందీ సినిమాల్లో బాగానే బిజీగా వుంది. తెలుగులో కేవలం వెంకీమామ అన్న సినిమాలో నాగ చైతన్యకి జోడిగా ఎంపికైంది రకుల్. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక తమిళంలో మాత్రం అన్నదమ్ములు సూర్య, కార్తీ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే కార్తీతో నటించిన దేవ్ సినిమా తెలుగు, తమిళంలో నిన్న లవర్స్ డే రోజున విడుదలైంది. అలాగే అన్న సూర్య  ఎంజికె సినిమా టీజర్ కూడా నిన్న లవర్స్ డే రోజునే విడుదలైంది. మరి ఎంజికె టీజర్ పర్వాలేదనిపించింది.. కానీ దేవ్ తోనే రకుల్ కి ఇత్తడైపోయింది.
నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవ్ సినిమాకి ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ రావడంతో.. సినిమాలో నటించిన రకుల్ కి దెబ్బపడిపోయింది. దేవ్ సినిమాని ఒకడెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించాడు. సినిమాలో హీరోహీరోయిన్స్ కేరెక్టరైజేషన్స్ సరిగ్గా లేకపోవడంతో... సినిమాలో నటించిన కార్తీకి అలాగే రకుల్ కి ఆ సినిమాతో పెద్దగా పేరు రాలేదు. ఏదో రకుల్ గ్లామర్ తో కాస్త మైమరపించినా... ఆ సినిమాలో రకుల్ పాత్రని ఎందుకు పెట్టారో అర్ధం కాదు. మేఘనగా యంగ్ బిజినెస్ ఉమన్ గా రకుల్ గ్లామర్ గా కనబడింది కానీ.. ఆమె పాత్రకి అస్సలు స్కోప్ లేదు. ఇక సాంగ్స్ లో రకుల్ అందాల ఆరబోత బావున్నప్పటికీ సినిమాకి నెగెటివ్ టాక్ రావడం రకుల్ పాలిట శాపంలా మారింది.
అలాగే సినిమాలో కొన్ని చోట్ల రకుల్ లుక్ తేడాగా అనిపిస్తుంది. రకుల్ కు మేకప్ అంతగా నప్పలేదు. మరికొన్ని సీన్స్ లో రకుల్ ఏదో మొక్కుబడిగా నటించేసింది. అలాగే మరికొన్ని సీన్స్ లో రకుల్ అబ్బాయిలా క‌నిపించింది. అలా ఉంటే.. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎక్క‌డ వ‌ర్క‌వుట్ అవుతుంది... మరి ఈ సినిమా దెబ్బకి రకుల్ ప్రీత్ కి ఫ్యూచర్ అర్ధమై ఉంటుంది. తెలుగులోనే కాదు.. ఇక తమిళంలోనూ రకుల్ కి గడ్డు కాలం మొదలైనట్టే.


 


 
Recent Post